ఛాంపియన్ ట్రోఫీ లో చిత్తైన ఇంగ్లడ్.. ఫైనల్లో పాక్
- June 14, 2017
ఇంగ్లండ్‌పై ఘన విజయం
పాక్ ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శన
వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఇంగ్లండ్‌ను చూసి ప్రతి ఒక్కరూ ఫైనల్‌కు ఆ జట్టే వెళ్తూందని భావించారు. ఇక మాజీ క్రికెటర్లు బెట్ కూడా వేసుకున్నారు.. చివరికి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నోటా కూడా ఇదే మాట.. కానీ అందరి అంచనాలు పటా పంచెలు చేస్తూ పాక్ ఫైనల్ రేసుకు దూసుకెళ్లి దాయదీ జట్లకు సవాలు విసిరింది.
చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో పాక్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీలో ఓటమెరుగని జట్టును ఓడించి ఇంటికి సాగనంపింది. ఆడినా మూడు మ్యాచుల్లో 300 పై చిలుకు పరుగులు చేసిన ఇంగ్లండ్‌ను పాక్ 211 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకోగా.. బ్యాట్స్‌మెన్స్ తమ బాధ్యతను నిర్వర్తించి విజయాన్నందించారు. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్, ఓపెనర్లు అజార్, ఫకార్‌లు అర్ధ సెంచరీలతో చెలరేగడంతో రెండో వికెట్‌కు 118 పరుగులు జమయ్యాయి.
తొలుత 49 బంతుల్లో ఫకార్ అర్ద సెంచరీ చేయగా, అజార్ 68 బంతుల్లో సాధించాడు. వీరి శతక భాగస్వామ్యానికి ఇంగ్లండ్ నిర్ధేశించిన లక్ష్యం చిన్నబోయింది. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫకార్ వెనుదిరగగా క్రీజులోకి వచ్చిన బాబర్, అజార్ తో కలిసి ఆచితూచి ఆడాడు. అజార్ అలీ(70; 100 బంతులు,5 ఫోర్లు,1 సిక్స్) అవుటవ్వడంతో మూడో వికెట్‌కు 55 పరుగులు జమయ్యాయి. దీంతో పాక్ విజయం సులువైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన హఫీజ్ సాయంతో బాబర్ మిగతా పనిని పూర్తిచేశాడు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు చేసిన ఇంగ్లండ్ పాక్ బౌలర్ల దాటికి 211 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌లో బెయిర్ స్టో(43), జోరూట్ (46), బెన్ స్టోక్స్(34), మోర్గాన్(33)లు విఫలమవ్వడంతో ఇంగ్లండ్ పాక్‌కు స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ (3), రుమాన్ రయీస్ (2), జునైద్ ఖాన్ (2), షదాబ్ ఖాన్(1) వికెట్లు పడగొట్టారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







