'గల్ఫ్' సినిమా తీసినందుకు గర్విస్తున్నాం
- June 14, 2017
- సునీల్‌కుమార్‌రెడ్డి
ఎడారి దేశాలకు వలస వెళ్లిన లక్షలాది మంది తెలుగువారి జీవన స్థితిగతులను, గల్ఫ్‌లో వారి భావోద్వేగాలను ఒక ప్రేమకథ నేపథ్యంలో చూపించే సినిమా ‘గల్ఫ్’. పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేతన మద్దినేని, డింపుల్ జంటగా నటించారు. ‘సరిహద్దులు దాటిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ మాటలు సమకూర్చిన ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘గల్ఫ్‌లో ఇరవై ఐదు లక్షలమంది తెలుగువారు జీవిస్తున్నారు. మేం నాలుగొందల కుటుంబాలను కలిసి, మాట్లాడి తయారుచేసుకొన్న కథతో ఈ సినిమా చేశాం. ‘గల్ఫ్’ను తీసినందుకు గర్విస్తున్నాం. ఒక ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాని రూపొందించాం’’ అని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







