బ్రిటన్‌లోని లండన్ అగ్నిప్రమాద ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య
- June 14, 2017
బ్రిటన్‌లోని గ్రెన్‌ఫెల్ టవర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. 27 అంతస్తుల భవనంలో నిన్న అర్థరాత్రి చెలరేగిన మంటలు ఇంకా చల్లారలేదు. ఈ భవనం ఏ క్షణానైనా కూలిపోయే ప్రమాదం ఉంది. పెద్ద ఎత్తున పెచ్చులు రాలి పడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. హెలికాప్టర్ ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ బిల్డింగ్‌లో సుమారు రెండు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గాయాలతో బయటపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఇంకా చాలా మంది అపార్ట్ మెంట్లో చిక్కుకుని ఉంటారని చెబుతున్నారు. కొందరు మంటల్లో సజీవదహనమైతే.. మరికొందరు పొగ కారణంగా ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు విడిచారు. భవనంలో మంటలు పూర్తిగా చల్లారితే కానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదంటున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఈ టవర్‌లో మొత్తం 120 ఫ్లాట్స్ ఉండగా...రెండో అంతస్తు నుంచి చివరి అంతస్తు వరకూ మంటలు వ్యాపించడంతో టవర్ పూర్తిగా అగ్నికీలలతో మూసుకుపోయింది. భవనంలో మంటలు చెలరేగడానికి కారణం ఏంటో తెలియడం లేదు. దీని వెనుక కుట్ర ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మంటలు అంటుకున్న సమయంలో కొందరు వ్యక్తులు భవనం పై నుంచి కిందకు దూకినట్టు చెబుతున్నారు. అయితే, వారే మంటలు అంటించారనే ఆధారాలేమీ లేవు. మంటల్లో నుంచి బయటకు వెళ్లలేక భయంతో దూకేసి ఉండొచ్చనే వాదన కూడా ఉంది. పై అంతస్తుల్లో ఉన్న వారు ప్రాణభయంతో అరుపులు, కేకలు వేసినట్టు చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. పశ్చిమ లండన్‌లో ఉన్న ఈ గ్రెన్ ఫెల్ టవర్‌ని 1970ల్లో నిర్మించారు. నాటింగ్ హాల్‌కు దగ్గర్లో ఉంది. 27 అంతస్తుల ఈ అపార్ట్ మెంట్లో 120 ఫ్లాట్లు ఉంటాయి. దీన్ని రీ మోడల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఫెసిలిటీస్ కోసం 70 కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు. గత ఏడాది మేలోనే ఈ పనులు పూర్తయ్యాయి. అయితే, అత్యవసర మార్గాలు ఏర్పాటు చేయాలంటూ గత ఏడాదే స్థానికులు యాజమాన్యానికి సూచించారు. కానీ, వాటిని సరిగా పట్టించుకోలేదని ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







