ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చే లుక్ తో హీరో రానా "నెంబర్ 1 యారి"
- June 15, 2017
లీడర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టిన రానా.. కెరీర్ మొదటి నుంచీ డిఫరెంట్ సినిమాలను ఎంచుకోంటూనే ఉన్నాడు.. ఇక బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకొన్నాడు. తాజాగా బుల్లి తెరపై హోస్ట్ గా అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నాడు... ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ జెమినీ లో రానా తో "నెంబర్ 1 యారి" తో స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు.. కాగా రానా చేస్తోన్న నెంబర్..1 యారి షో ఎలాఉండబోతున్నది? అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది అని చెప్పవచ్చు.. తెలుగు తమిళ భాషల్లో రాబోతున్న ఈ షో లో రానా లుక్ చాలా డిఫరెంట్ గా డీసెంట్ గా ఉన్నది అని పోస్ట్ చూస్తే తెలుస్తుంది..
తాజాగా రానా నెంబర్ 1 యారి ప్రోగ్రాం కు సంబంధించిన టీజర్ ను సదరు ఛానల్ వారు రిలీజ్ చేశారు.. తమ టీఆర్ పీ రేటింగ్ కోసం టాలీవుడ్ స్టార్స్ అత్యధిక రెమ్యునరేషన్ ను ఇచ్చి మరీ బుల్లితెరపై బరిలోకి దింపుతున్నారు. కాగా ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ తో మా టీవీలో రానున్న సంగతి విధితమే.. మరి ఈ రెండు షో లు ఒకే సమయంలో టెలికాస్ట్ అవుతాయా..! లేక రెండింటినీ ఆదరించేలా డిఫరెంట్ టైమ్ ను సెట్ చేసుకొంటాయా చూడాలి మరి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







