'ఒంటరి' ఖతార్తో అగ్రరాజ్యం అమెరికా ఒప్పందం
- June 15, 2017
ఉగ్రవాదానికి మద్దతిస్తుందంటూ అరబ్ దేశాలు ఖతార్తో తెగదెంపులు చేసుకోగా.. అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఆ దేశానికి దౌత్యపరమైన మద్దతిస్తున్నట్లు కన్పిస్తోంది. త్రీవ దౌత్య సంక్షోభంలో ఉన్న ఖతార్.. అమెరికాతో 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ.77వేల కోట్లు) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు అమెరికా నుంచి 36 ఎఫ్-15 జెట్ విమానాలను కొనుగోలు చేసేందుకు ఖతార్ 12 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై వాషింగ్టన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో అమెరికా, ఖతార్ రక్షణ మంత్రులు జిమ్ మ్యాటీస్, ఖలీద్ అల్-అథియా ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే ఉగ్రవాదంపై మూకుమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చిన అమెరికా ఇప్పుడు.. ఖతార్తో ఒప్పందం కుదుర్చుకోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదానికి మద్దతివ్వడంతో పాటు తమను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ.. ఇటీవల నాలుగు అరబ్ దేశాలు ఖతార్తో సంబంధాలు తెంచుకున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాతో పాటు ఈజిప్ట్, యూఏఈ, బహ్రెయిన్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీఅరేబియాలో పర్యటించిన సందర్భంగా..
ఉగ్రవాదంపై పోరులో ముస్లిం దేశాలన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే అరబ్ దేశాలు ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇరాన్ మద్దతుతో ఇస్లామిక్స్టేట్ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఖతార్ మద్దతిస్తోందని అరబ్ దేశాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఖతార్తో దౌత్యసంబంధాలు తెంచుకోవడంతో పాటు ఆ దేశానికి వెళ్లే రవాణా వ్యవస్థను కూడా నిలిపివేశాయి.
తమ పౌరులు ఖతార్కు వెళ్లరాదని సౌదీ అరేబియా ఆంక్షలు విధించింది. ఖతార్తో ఉన్న సరిహద్దులను అరబ్దేశాలు మూసివేశాయి. విమాన సర్వీసులను కూడా నిలిపివేశాయి. దీంతో ఖతార్లో దౌత్య సంక్షోభం ఏర్పడింది.
కాగా.. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







