ఎగ్ చపాతీ
- June 15, 2017
కావలసిన పదార్థాలు
గోధుమ పిండి- 2కప్పులు, గుడ్లు-4, కారం-25గ్రా, ఉల్లిపాయాలు- సన్నగా తరిగినవి అరకప్పు, కొత్తిమీర- సన్నగా తరిగింది అరకప్పు, పచ్చిమిరపకాయాలు- సన్నగా తరిగినవి4, ఉప్పు- చిటికెడు, నూనె, 2 చెంచాలు(ఆమ్లెట్ వేయడానికి)
తయారీ విధానం
ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత చపాతీలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని అందులో ఒక గుడ్డును పగులగొట్టి అందులో పచ్చిమిర్చి, కారం, కొత్తిమీర, ఉల్లిపాయాల తురుము, ఉప్పు చిటికెడు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పెనంపై ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ వేగుతుండగా ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని దానిపై వేసి కొద్దిగా నొక్కాలి. తర్వాత సన్నని మంటపై ఆమ్లెట్‌ని రెండు వైపులా తిప్పుతూ దోరగా కాల్చాలి. దాంతో ఎగ్‌చపాతీలు రెడీ. రెడీ అయిన చపాతీలను ముక్కలుగా కట్‌చేసుకుని టమోటా సాస్ లేదా కొబ్బరి చట్నీతో కలిపి తింటే బాగుంటాయి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







