అన్నం తినేందుకు ముందు ఆకలేస్తే నట్స్ నమిలేయండి

- June 15, 2017 , by Maagulf
అన్నం తినేందుకు ముందు ఆకలేస్తే నట్స్ నమిలేయండి

అన్నం తినడానికి ముందర ఆకలి వేస్తే జంక్ ఫుడ్ తీసుకోకుండా వాటికి బదులుగా కొన్ని నట్స్ తీసుకుంటే బరువు తగ్గుతారు. బాదం పప్పులు, జీడి పప్పులు, పిస్తాలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. అయితే ఉప్పు కలిపిన నట్స్‌ను మాత్రం తినొద్దు. ఎందుకంటే సోడియం ఎక్కువ శాతం శరీరంలోకి వెళ్లడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. 
 ఇక బరువు తగ్గాలంటే.. ప్లెయిన్‌ ఓట్‌ మీల్‌ తింటే ఎంతో మంచిది. ఇందులో పీచుపదార్థాలు బాగా ఉంటాయి. పైగా వీటిని తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. పొట్ట చుట్టూరా కొవ్వు చేరి ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఓట్‌ మీల్‌ మంచి దివ్యౌషధం. వీటిని తినడం వల్ల పొట్ట చుట్టూ చేరిన కొవ్వు తగ్గుతుంది.
 అలాగే బెర్రీస్‌ను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా  బరువు తగ్గొచ్చు. యాంటాక్సిడెంట్లు, పీచుపదార్థాలు బెర్రీల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. బెర్రీలంటే స్ట్రాబెర్రీస్‌, బ్లూబెర్రీస్‌ ... ఇవన్నీ బ్లడ్‌ షుగర్‌ని తగ్గిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com