మనామలో అగ్నిప్రమాదం
- June 15, 2017
మనామాలో ఒక నిషేధమైన షెడ్ లో ఒక అగ్నిప్రమాదం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రదేశంలో అగ్నిప్రమాదం జరగడం రెండవ సారి అని తెలిపారు.అగ్ని ప్రమాదం జరిగిన స్థలం ఉన్న రెండు నివాస భవనాల మధ్య ఉంది. దీనితో అక్కడ నివాసితులు తమ వద్ద ఉన్న చెత్తాచెదారాలను ఖాళీగా ఉన్న ఆ ప్రదేశం వైపు విసిరి పారవేస్తుంటారు. ఈ క్రమంలో ఎవరో ఒక వ్యక్తి నిప్పు ఆర్పని సిగరెట్ ను ఆ చెత్తపైకి విసరడంతో అది రగిలి చెత్తను మండించి ఉండొచ్చని అక్కడ నివాసితులు ఊహిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఏ కారణం చేతనో ఒక్కసారిగా వేగంగా మంటలు వ్యాపించేలా చేసింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలో సివిల్ డిఫెన్స్ ఆ ప్రాంతానికి చేరుకొని మంటలను ఆర్పీ పరిస్థితిని అదుపులోనికి తెచ్చింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికి ఎటువంటి గాయాలు కాలేదని అగ్నిమాపక సిబ్బంది పేర్కొంది. ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణం తెలుసుకొనేందుకు అధికారులు పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







