తెలంగాణ లో హైదరాబాద్ మెట్రో కు అరుదైన రికార్డ్
- June 16, 2017
హైదరాబాద్ మెట్రో కు అరుదైన రికార్డ్ సాధించింది. ప్రతిష్టాత్మక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు చోటు దక్కించుకుంది. ఏకంగా మూడు విభాగాల్లో ఈ ఘనత సాధించింది. ఒక మెట్రో ప్రాజెక్ట్ మూడు లిమ్కా రికార్డులను నమోదు చేయడం ఇదే తొలిసారని అధికారులు చెప్పారు. ఈ రికార్డులను మెట్రో 2017 తాజా ఎడిషన్‌లో ప్రచురించారు.
నిర్మాణ దశలోనే అన్ని మెట్రో స్టేషన్లలో ప్రసార హక్కులను శ్రేయా బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు అందించింది. దీంతో టీవీ5 ఛానెల్ 66 మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు తాజా వార్తల్ని అందించనుంది. ఇందుకోసం 2015 , జనవరి 29న సంతకాలు జరిగాయి.
మెట్రో రైలు ప్రారంభానికి ముందే మెట్రో రైలు చుట్టూ ట్రైన్ వ్రాప్ అడ్వరైజింగ్ హక్కులను వివిధ సంస్థల నుంచి పొందింది. ఇందుకోసం 2014 జూలై 22న వీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అన్ని స్టేషన్లలో రిటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు 2015 , సెప్టెంబర్ 11న కోకాకోలా బేవరేజెస్ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది హైదరాబాద్ మెట్రో.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







