47ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకోనున్న శోభన..?
- June 17, 2017
ఇన్నాళ్లపాటు వివాహమే వద్దంటూ నాట్యకళకు తనను అంకితం చేసుకున్న సినీ నటి శోభన.. 47 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేరళ జిల్లా తిరువనంతపురంకు చెందిన శోభన.. దక్షిణాది హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది.
భరత నాట్య కళాకారిణిగానూ, నటిగానూ సినీ రంగంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ కొచ్చాడియన్లో శోభన నటించింది. దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలోనూ ఆమె నటించింది.
2001లో శోభన ఆనంద నారాయణీ అనే అమ్మాయిని దత్తపుత్రికగా స్వీకరించింది. ప్రస్తుతం శోభనకు 47ఏళ్లు. ఇలాంటి తరుణంలో స్నేహితుడు, ఫ్యామిలీ ఫ్రెండ్‌ను శోభన మనువాడనుందనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నాట్య కళాకారిణిగా ఇన్నాళ్లు ఆ కళకు అంకితమైన శోభన 2006లో పద్మశ్రీ అవార్డును గెలుచుకున్నారు.
ఇప్పటికీ పలు క్లాసికల్ షోల్లో పాలుపంచుకుంటున్న ఆమె చెన్నైలో ఓ డ్యాన్స్ స్కూలును కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శోభన వివాహం చేసుకోనున్న వ్యక్తి పేరు ఇంకా బయటికి రాలేదు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







