ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లోకి తెలుగు బ్యాడ్మింటన్ స్టార్‌

- June 17, 2017 , by Maagulf
ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లోకి తెలుగు బ్యాడ్మింటన్ స్టార్‌

తెలుగు బ్యాడ్మింటన్ స్టార్‌ కిదాంబి శ్రీకాంత్.. ఇండోనేషియా ఓపెన్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఇవాళ జరిగిన సెమీస్‌లో ప్రపంచ నెంబర్ వన్‌ సన్‌ వాన్ హో పై ఘన విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌ సెట్‌ను 21-15 తేడాతో గెలుచుకున్నాడు శ్రీకాంత్. అయితే... రెండో సెట్‌ను 18-21 తేడాతో కోల్పోవడంతో.. మూడో సెట్‌ కీలకంగా మారింది. విజయం కోసం ఇద్దరూ పోటాపోటీగా తలపడినా.. 24-22 తేడాతో సెట్ కైవసం చేసుకుని.. సన్‌ వాన్‌కు షాక్ ఇచ్చాడు శ్రీకాంత్. సన్‌ వాన్ హో తో గతంలో జరిగిన నాలుగు మ్యాచ్‌లనూ వరుసగా ఓడిపోయినప్పటికీ.. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడి పైచేయి సాధించాడు శ్రీకాంత్. ఆదివారం జరిగే మ్యాచ్‌లో టైటిల్‌ కోసం సాకాయ్‌తో తలపడనున్నాడు. మరో సెమీస్‌లో  ఇండియన్ బాడ్మింటన్ స్టార్‌ ప్రణయ్‌.. జపాన్‌కు చెందిన సాకాయ్ చేతిలో అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. లేదంటే... ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో.. ఇద్దరూ ఇండియన్సే తలపడాల్సి వచ్చేది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com