15 నిమిషాల్లో దుబాయ్ నుంచి అబుదాబీకి
- October 13, 2015
ఊహలకే అందని ఆశ్చర్యకరమైన విషయం ఇది. కానీ ఇది వాస్తవ రూపం దాల్చడం అసాధ్యం కాబోదని ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ ఛైర్మన్ మాటల్లో చూస్తే, హైపర్‌లూప్ పాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని తొలిసారిగా వినియోగించుకునే దేశంగా యూఏఈ అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ ఇంజనీర్ మాట్లాడుతూ, 1200 మైల్స్ పెర్ అవర్ వేగంతో హైపర్ లూప్ ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుందనీ, అన్నీ సహకరిస్తే 2020 నాటికే ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేయవచ్చని అన్నారు. దుబాయ్‌లో పర్యటిస్తున్న పీటర్ డైమాండిస్ చెబుతూ, జపాన్‌కి చెందిన మాగ్లెవ్ బుల్లెట్ ట్రైన్‌కి రెండింతల వేగంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలపై దూసుకుపోతుందన్నారు. మాగ్లెవ్ ట్రైన్ ప్రాజెక్ట్ 318 బిలియన్ డాలర్ల ఖర్చుతో రూపొందింది. టోక్యో మరియు ఒసాకాల మధ్య కేవలం ఒక గంట ప్రయాణ సమయంలోనే ఈ రైలు దూసుకుపోతుంది. అయితే ఎలాన్ మస్క్ మాగ్లెవ్ ప్రాజెక్ట్‌ల కన్నా తక్కువ ఖర్చుతోనే హైపర్‌లూప్ ప్రాజెక్ట్ పూర్తి చేయవచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అబుదాబీ నుంచి దుబాయ్‌కి కేవలం 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







