ఔరా! ఇదేమి వెర్రి!
- June 22, 2017
సోషల్ మీడియాలో లైకులు, కామెంట్స్ కోసం కొందరు నెటిజన్లు తమ జీవితాలతోపాటు ఇతరు జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేందుకు వెనుకాడటం లేదు. ఇటీవల తను పోస్టు చేసిన ఫొటోకు వెయ్యి లైకులు రాకుంటే తన కొడుకును 160ఫీట్ల ఎత్తైన భవనం నుంచి కిందపడేస్తానని బెదిరింపులకు గురిచేశారు. దీంతో నెటిజన్లంతా ఆందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
ఆ వివరాల్లోకి వెళితే.. అల్గేరియాకు చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల చిన్నారిని అతడు వేసుకున్న టీషర్టును మాత్రమే పట్టుకుని 15అంతస్తుల భవనం బాల్కనీ నుంచి వేలాడదీశాడు. సోషల్ మీడియాలో ఈ ఫొటో పెడుతూ.. 'నాకు వెయ్యి లైకులు ఇవ్వండి. లేదంటే చిన్నారిని వదిలేస్తా' అంటూ పోస్టు పెట్టాడు.
ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే చాలా మంది ఆ చిన్నారిని కాపాడేందుకు లైకులు కూడా కొట్టారు. అయితే, మరికొందరు మాత్రం చిన్నారిని హింసిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేశారు.
అయితే, తాను మాత్రం సరదాగా చేశానంటూ నిందితుడు కోర్టులో తెలిపాడు. అయితే, చిన్నారి పొరపాటున కిందపడితే పరిస్థి ఏంటని ప్రశ్నించారు. అంతేగాక, ఫొటోలో చిన్నారిని ప్రమాదకరస్థితిలో పట్టుకున్నాడని నిర్ధారిస్తూ జడ్జీ అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







