అల్లర్ల కేసులో నేరస్థులకు జైలుశిక్షలను తగ్గించిన కోర్టు
- June 22, 2017
మనామా: అల్లర్లను అదుపు చేయడానికి వచ్చిన ఓ పోలీసు అధికారిపై దాడి చేసి గాయపర్చిన ముగ్గురు వ్యక్తులకు అప్పీల్ ను బుధవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది, కానీ నిందితులకు జైలు నిబంధనలను సవరించి ఏడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు తగ్గించింది. ఈ ముగ్గురు బిల్డ్ ఆల్ ఖదీమ్ గ్రామంలో వెల్లువెత్తిన అల్లర్లలో 40 మంది సబాటర్స్ ఉన్నారు. ఫైర్ బాంబులతో సన్నివేశంలోకి వచ్చిన పోలీసు అధికారులపై దాడి చేసి, ఇనుప రాడ్లతో చితకబాదారు, అనంతరం చెల్లాచెదురుగా పారిపోయారు. అంతేకాక నిందితులు రోడ్లపై పెద్ద పెద్ద బండరాళ్లను మరియు భారీ దుంగలను అడ్డంగా పర్చి ఆ మార్గంపై ప్రయాణించకుండా చేశారు. గాయపడిన పోలీసును అతని సహచరులు అక్కడ నుంచి వెళ్లేందుకు ఎంతో శ్రమించి అడ్డంకులన్నింటిని తొలగించి ఎట్టకేలకు ఆసుపత్రికి తరలించారు. శిక్ష పడిన అపరాధులలో ఒకరు ఆ పోలీస్ తలపై ఒక ఇనుప కడ్డితో బలంగా మోదాడు. అక్కడ వైద్యులు పరీక్షలు జరిపి ఒక ప్రేగును కత్తిరించినట్లు వెల్లడించారు, ఎందుకంటే అల్లర్లు జరిగిన సమయంలో ఓ నిందితుడు సూదిగా ఉన్న ఓ ఇనుప రాడ్ ను పోలీస్ అధికారి కడుపు లోనికి దించివేశాడు. ఈ కేసులో డిటెక్టీవ్ లు త్వరితగతిన దర్యాప్తులు ప్రారంభించి, అల్లర్లకు పాల్పడిన 12 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను ఇంతకుముందు దోషులుగా నిర్ధారించారు. వారందరికీ ఏడు సంవత్సరాల జైలుశిక్షను కోర్టు విధించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







