సబ్సిడీ ఎత్తివేతతో బహ్రెయినీలకు లబ్ది
- October 13, 2015
80 శాతం మీట్ సబ్సిడీ పొందుతున్నవారిలో వలసవాదులు, కంపెనీలు మరియు రెస్టారెంట్లు మాత్రమేనని షౌరా కౌన్సిల్ ఎఫైర్స్ మినిస్టర్ ఇసా అల్ హమ్మాది ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ప్రభుత్వ అధికార ప్రతినిథి కూడా అయిన అల్ హమ్మాదీ, బహ్రెయినీలకు సబ్సిడీ కొనసాగుతుందనీ, అయితే సబ్సిడీ సొమ్ము బహ్రెయినీల ఖాతాలోకి డైరెక్ట్‌గా వెళుతుందని అన్నారు. 130,000 మంది బహ్రెయినీలు మీట్ సబ్సిడీల కోసం దరఖాస్తు చేసుకున్నారనీ, మీట్ సబ్సిడీ ఎత్తివేసినప్పటినుంచీ వారి ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీ మొత్తం చెల్లించబడుతుందని వివరించారు. బహ్రెయినీలకు నష్టం లేకపోవడంతో మీట్ సబ్సిడీ ఎత్తివేసే ఆలోచనే లేదనీ, దేశ ప్రజలకు ఇస్తున్న సబ్సిడీ, కమర్షియల్ కోణంలో పక్కదారి పడుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు అల్ హమ్మాది. అయితే మార్కెట్లో అమ్మకాలు తగ్గిపోవడంతో మీట్ వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. చాలా రెస్టారెంట్లు మీట్ ఉత్పత్తుల్ని మెనూలోంచి తీసేశాయి మీట్‌పై సబ్సిడీ ఎత్తివేసిన తర్వాత.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







