అమ్మలందరికీ మామ్ చిత్రం అంకితం : హీరోయిన్ శ్రీదేవి
- June 23, 2017
అలనాటి అందాల నటి శ్రీదేవి నటించిన మామ్ చిత్రం జులై 7న విడుదల కాబోతోంది. రవి ఉదయవార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మించారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చెన్నై వచ్చిన శ్రీదేవి పాత్రికేయులతో మాట్లాడుతూ తల్లి, కుమార్తెలకు మధ్య ఉండే భావోద్వేగమైన చిత్రమే మామ్ అని అన్నారు. నేటికీ మహిళలు, ఆడ పిల్లలకు భద్రతలేదని, వాళ్లు బయటకువెళ్లి మళ్లీ ఇంటికి వచ్చే వరకు తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని అమ్మలందరికీ అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర స్థాయిని మరింత పెంచెలా చేసింది రెహ్మాన్ సంగీతం అని అన్నారు. తాను జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి తన తల్లి కారణమని వివరించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







