చెన్నై సిల్క్ భవనం శిధిలాల కింద కిలోల కొద్దీ బంగారం, వెండి
- June 23, 2017
చెన్నై సిల్క్ భవనం గురించి కొత్త న్యూస్ వినిపిస్తుంది.. తాజాగా సిల్క్ భవన శిధిలాల్లో 400 కిలోల గోల్డ్, 2 వేల కిలోల వెండితో ఉన్న పెద్ద బాక్స్ లు బయటపడ్డాయి. బహిరంగా మార్కెట్లో వీటి విలువ రూ. 120 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇంతకీ శిధిలాల కింద ఈ బాక్సులు ఎలా వచ్చాయి ? అన్నదానిపై అనుమానాలు మొదలయ్యాయి. మే 31న చెన్నై టీ.నగర్ లోని సిల్క్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభంవించింది. రెండు రోజులపాటు మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనలో కోట్లాది రూపాయులు విలువైన వస్త్రాలు, నగలు కాలిపోయాయని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దీంతో తమిళనాడు ప్రజాపన్నుల శాఖ, భవనాన్ని పూర్తిగా కూల్చివేసేందుకు 20 రోజులపాటు పనులను సాగించింది. శిధిలాలు తొలగించిన తర్వాత రెండు భారీ బాక్సులు కనిపించగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వీటిల్లో 400 కిలోల బంగారం, 2 వేల కిలోల వెండి ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







