రోడ్లపై స్పీడ్ లిమిట్ సడలింపు
- June 23, 2017
మనామా: ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సూచనల మేరకు కింగ్‌డమ్‌లోని పలు రోడ్లపై స్పీడ్ లిమిట్‌ని సవరించారు. షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే పై ఇప్పటిదాకా ఉన్న స్పీడ్ లిమిట్ గంటకు 100 కిలోమీటర్లు కాగా, ఇకపై దాన్ని 120కి పెంచారు. యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ వద్ద ఫ్లై ఓవర్ నుంచి షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవేపైన మిడిల్ ఫ్లై ఓవర్ వరకు ఈ స్పీడ్ లిమిట్ పెంపు జరిగింది. బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్ వద్ద కింగ్ ఫైసల్ హైవే పైన 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు (గంటకు) స్పీడ్ లిమిట్‌ని పెంచడం జరిగింది. ఆయా రోడ్లపై భద్రతా ప్రమాణాలు వంటివాటిని పరిగణనలోకి తీసుకుని రోడ్లపై వేగాన్ని పెంచారు. ఇంకో వైపున పలు రోడ్లపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రాడార్లు, నిబంధనలు ఉల్లంఘించినవారిని గుర్తిస్తున్నాయి. వారిపై చర్యలు తప్పవని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







