షార్జాలో మహిళ మృతిపై విచారణ ప్రారంభం
- June 23, 2017
షార్జా: షార్జా పోలీసులు, అల్ గఫ్యా ప్రాంతంలోని ఓ ఇంట్లో మృతి చెందిన 26 ఏళ్ళ మహిళకు సంబంధించిన కేసు విచారణ ప్రారంభించారు. షార్జా పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ, బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ఫోన్ కాల్ వచ్చిందనీ, మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లుగా తెలియజేశారని చెప్పారు. మృతురాల్ని అచేతనావస్థలో కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెను ఉదయం 5.35 నిమిషాల సమయంలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆమె మృతి చెందినట్లుగా ప్రకటించడం జరిగింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ టీమ్, ఈ కేసు విచారణ చేపట్టింది. అటాప్సీ కోసం ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి మృతదేహాన్ని తరలించారు. ఆమెది హత్యా? లేదంటే ఆత్మహత్యకు పాల్పడిందా? అనే విషయం తేలాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







