భారీ ఎత్తున 'రోబో 2.0' ఆడియో అండ్ ట్రైలర్ రిలీజ్
- June 23, 2017
ఇండియాలోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న చిత్రం 'రోబో 2.0'. లేటెస్ట్‌గా ఈ సీక్వెల్ మూవీ ఆడియో అండ్ ట్రైలర్ రిలీజ్ డేట్స్ ఫిక్సయ్యాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'రోబో 2.0'. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఇక ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్నందిస్తున్న 'రోబో 2.0' ఆడియోను అక్టోబర్‌లో విడుదల చేయనున్నారట. దుబాయ్‌లో జరగనున్న ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను.. భారీ ఎత్తున జరపనున్నారట. చిత్ర యూనిట్‌తో పాటు.. పలువురు హాలీవుడ్ నటులు కూడా ఈ ఆడియో వేడుకకు హాజరుకానున్నారట. తలైవా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రోబో 2.0' ట్రైలర్‌ని.. రజనీకాంత్ పుట్టినరోజైన డిసెంబర్ 12న విడుదల చేయనున్నారట. ఇక ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో.. త్రీడీలో రెడీ అవుతోన్న ఈ చిత్రంలో రజనీకాంత్‌కు జోడీగా అమీ జాక్సన్ నటిస్తోంది. మొత్తంమీద.. బ్లాక్ బస్టర్ 'రోబో' చిత్రానికి సీక్వెల్ అయిన 'రోబో 2.0'.... బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేయనుందో తెలియాలంటే వచ్చే యేడాది జనవరి 25 వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







