'ప్రేమలీల పెళ్ళిగోల' ట్రైలర్ విడుదల
- June 24, 2017
ఇటీవల తమిళ్ విడుదలై బ్లాక్ బస్టర్ అయిన `వెల్లై కారన్` చిత్రాన్ని 'ప్రేమలీల-పెళ్ళి గోల' టైటిల్ తో మహా వీర్ పిలిమ్స్ అధినేత నిర్మాత పారస్ జైన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్, నిక్కీ గల్రానీ నాయకానాయికలుగా నటించారు. ఎళిల్ దర్శకత్వం వహించారు. 'జర్నీ' ఫేం సత్య సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది.
శ్రీ మహావీర్ ఫిలింస్ అధినేత, నిర్మాత పారస్ జైన్ మాట్లాడుతూ 'తమిళ్ లో ఈ సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్యా. ఎలాగైనా ఈ చిత్రాన్ని మన ఆడియన్స్ కు అందించాలని చాలా మంది పోటీ పడ్డా..నా మీద నమ్మకంతో విశాల్ నాకు రైట్స్ ఇచ్చారు. ముందు ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నా. కానీ విశాల్ రీమేక్ చేస్తే కామెడీ మిస్ అవుతుందనడంతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. చక్కని హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు ఆడియన్స్ కు బాగా నచ్చే సినిమా అవుతుంది. ఈరోజే ఎస్. వికృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారుతో పాటు పలవురు సినీ పెద్దల సమక్షంలో ప్రివ్యూ చూశాం. సినిమా చూసిన వారంతో బాగుందని ప్రశంసించారు. స్ర్టెయిట్ మూవీ చూసిన ఫిలింగ్ కల్గిందన్నారు. ఇక నా సినిమా కెరీర్ ఎస్. వికృష్ణరెడ్డి గారితో నే మొదలైంది. ఆయన చేసిన ఎన్నో సినిమాలు మా సంస్థనే రిలీజ్ చేసింది. వాళ్లందరి ఎంకరేజ్ మెంట్ నాకు ఉండటం సంతోషంగా ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలతో పాటు కర్ణాటక, ఒరిస్సా రాష్ర్టాల్లో జులై 1న సినిమా రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు.
నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ 'మహా వీర్ ఫిలిమ్స్ మా సినిమాలనే మొదటగా రిలీజ్ చేసింది. తర్వాత అదే సంస్థ ఎన్నో సినిమాలను సీడెడ్ లో పంపిణీ చేసింది. ఈరోజు సినిమా చూశాం చాలా బాగుంది. జంధ్యాల గారి ఆహనా పెళ్లంట..కృష్టారెడ్డి గారి కామెడీ సినిమాల్లా ఉంది. కడుపుబ్బా నవ్వుకునే హస్య సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ లో వచ్చే కామెడీ హైలైట్ గా ఉంటుంది. హీరో, హీరోయిన్లు చక్కగా నటించారు. జులై 1న ప్రేక్షకుల మందుకు వస్తుంది. పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాం' అని అన్నారు.
దర్శకుడు ఎస్. వి.కృష్ణారెడ్డి మాట్లాడూతూ 'పారస్ జైన్ గారు కామన్ ఆడియన్ లో ఆలోచిస్తారు. సినిమా సక్సెస్ ను ముందే అంచనా వేయగల వ్యక్తి. ఆయన పంపిణీ చేసిన ప్రతీ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా కూడా ఆకోవలో నిలుస్తుంది. సినిమా చూశాను. హిలేరియస్ ఎంటర్ టైనర్ ఇది. నేను ఏ కామెడీని నమ్ముతానో ఆ కామెడీ ఈ సినిమాలో ఉంది. ముఖ్యంగా కొన్ని కామెడీ సన్నివేశాలు ఒక రేంజ్ దాటి వెళ్లిపోయాయి. సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వడం ఖాయం. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది' అని అన్నారు.
చిత్ర హీరో విష్ణు విశాల్ మాట్లాడూతూ 'తమిళ్ లో పెద్ద హిట్ అయింది. తెలుగులో విడుదలవుతోన్న తొలి సినిమా ఇది. జులై 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు.
హీరోయిన్ నిక్కిగల్రానీ మాట్లాడుతూ, 'మంచి సినిమా ఇది. అన్ని పాత్రల్లోనూ హస్యం ఉంటుంది. థియేటర్ కు వచ్చిన ప్రతీ ప్రేక్షకుడు నవ్వు కోవడం ఖాయం. జులై1న సినిమా విడుదలవుతుంది. పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







