డి.జె పై కోర్టులో పిటీషన్
- June 26, 2017
అల్లు అర్జున్ `డీజే దువ్వాడ జగన్నాథమ్ వివాదం ఇంకా సమసిపోలేదు. ఈ సినిమాలో `అస్మైక యోగ తస్మైక భోగ..` అనే పాటలో `నమకం..చమకం..` అనే పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని వివాదం చెలరేగిన సంగతి విదితమే. ఈ వివాదంపై స్పందించిన చిత్ర దర్శక నిర్మాతలు సెన్సార్ సమయంలోనే నమకం..చమకం అనే పదాలను మార్చి వాటి స్థానంలో నా గమకం..నీ సుముఖం అనే పదాలను పొందుపరిచి సెన్సార్ సభ్యుల నుండి అమోదం పొందారు.
అయితే ఇపుడీ వ్యవహారం కోర్టుకు వెళ్ళింది. యజుర్వేదంలో ఉన్న నమకం, చమకం వంటి పవిత్రమైన పదాలను ఈ సినిమాలోని రొమాంటిక్ పాటలో ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన జి.కృష్ణమోహన్ ఈ పిటిషన్ను దాఖలు చేస్తూ అభ్యంతరకరమైన పదాలపై సెన్సార్ బోర్డుకు వినతిపత్రం సమర్పించినా వాటిని తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, వాటిని తొలగించేదాకా సినిమాపై నిషేధం విధించాలని కోరారు ఆయన. మరి ఈ వివాదం ఎక్కడికి వెళుతుందో చూడాలి.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







