పాతికేళ్ల సినీ సంగీత సెలెబ్రేషన్స్ చేసుకోనున్న ఏ ఆర్ రెహమాన్
- June 26, 2017
1992 మే 11 విడుదలైన రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచమయ్యాడు ఏర్ రెహమాన్. ఈ ఏడాది మే 11తో రోజా సినిమా వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పాతికేళ్ల సినీ సంగీత సెలెబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుపుకోవాలని డిసైడ్ అయ్యాడట రెహమాన్. డబుల్ ఆస్కార్ విజేత రెహమాన్ తన 25 ఇయర్స్ సెలెబ్రేషన్స్ స్వదేశంలో కాకుండా లండన్‌లో జరుపుకోనున్నాడట. అందుకోసం జులై 8న 'నేట్రో ఇంద్రు నాలై' అనే పేరుతో ఓ మ్యూజిక్ కాన్సెప్ట్‌ను కూడా ఏర్పాటు చేశాడట. ఈ కాన్సెప్ట్‌లో తన సినిమాల్లోని హిట్ సాంగ్స్‌ను ఆలపించి..ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ చేయనున్నాడట రెహమాన్. లండన్‌లో జరగబోయే మ్యూజికల్ కాన్సెప్ట్‌లో పాపులర్ సింగర్స్ పాల్గొంటారట. భారీ ఎత్తున జరగనున్న ఈ సెలెబ్రేషన్స్‌ను పలు మీడియా సంస్థలు కూడా లైవ్ టెలికాస్ చేసేందుకు పోటీ పడుతున్నాయట. మొత్తంమీద ప్రస్తుతం దక్షిణాదిన రూపొందుతున్న బడా బడ్జెట్ మూవీస్ రోబో 2.0, సంఘమిత్ర, మహాభారతానికి సంగీతాన్ని అందిస్తున్న రెహమాన్.. సంగీత దర్శకుడిగా మరో పాతికేళ్లు సక్సెస్ ఫుల్‌గా సాగిస్తాడని ఆశిద్దాం
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







