పుట్టినరోజు నాడే యువతి పై యాసిడ్ దాడి
- June 26, 2017
లండన్లో పుట్టినరోజు వేడుక చేసుకునేందుకు ఎంతో సరదాగా తన కజిన్ తో కలిసి కారులో వెళుతున్న 21 ఏళ్ల యువతిపై ఓ దుండగుడు యాసిడ్ దాడి చేసి ఆమె అందాన్ని చిదిమేసిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... 21 ఏళ్ల రేషమ్ ఖాన్ బిజినెస్ మేనెజ్ మెంట్ విద్యార్థిని.
తనకు 20 ఏళ్లు నిండి 21వ ఏటలో అడుగిడుతున్న సందర్భంగా తన కజిన్ జమీల్ ముక్తార్తో కలిసి పుట్టినరోజు పండుగ చేసుకోవాలని తూర్పు లండన్ లోని బెక్టన్ నుంచి అతడితో కారులో బయలుదేరింది. దారిలో రెడ్ సిగ్నల్ పడటంతో కారు ఆపారు. ఆ ప్రక్కనే అప్పటికే పొంచి వున్న ఓ దుండగుడు యాసిడ్ బాటిల్తో వారి వద్దకు వచ్చి ఇద్దరిపై పోసేసి పరారయ్యాడు.
ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు కారును వేగంగా నడిపినా ప్రయోజనం లేకపోయింది. ఇద్దరికీ యాసిడ్ అంటుకోవడంతో కారు నుంచి కిందికి బట్టలు విప్పి హెల్ప్ హెల్ప్ అంటూ ఆర్తనాదాలు చేశారు. ఐతే 45 నిమిషాల పాటు వారిని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఓ వ్యక్తి ముందుకు వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్పించాడు. ఆ యువతికి మెడ, వీపు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ కంటికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన జూన్ 21న జరుగ్గా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు ఇప్పటివరకూ పట్టుకోలేకపోయారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







