యోగా గురువు బాబా రామ్ దేవ్ గా అజయ్ దేవగన్
- June 27, 2017
ప్రస్తుతం సినీ పరిశ్రమకు కధల కొరత లేదు.. కొద్దిగా ఫేమస్ అయిన వ్యక్తుల... జీవితాల కధలను వెండి తెరపై ఆవిష్కరించి.. కాసులను పండించుకొంటున్నారు. దీంతో సినీ పరిశ్రమలో బయో పిక్ లకు డిమాండ్ పెరిగింది. హిస్టారికల్, రాజకీయ, క్రీడాకారుల జీవితలనే కాదు.. తాజాగా పతంజలి ప్రొడక్ట్స్ తో ఫేమస్ అయిన యోగా గురువు బాబా రామ్ దేవ్ జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా ఈ బాబా రామ్ దేవ్ గా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అని బీ టౌన్ టాక్.
గతంలో అజయ్ దేవగన్ నిర్మాతగా రామ్ దేవ్ జీవిత చరిత్రను బుల్లి తెరపై సీరియల్ గా ఆవిష్కరించే ప్రయత్నాలు జరిగాయి.. బుల్లి తెర నటుడు విక్రాంత్ మస్సే టైటిల్ రోల్ లో నటిస్తానని చెప్పి... లాస్ట్ మినిట్ లో సారీ చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు అదే స్క్రిప్ట్ ను సినిమాకు అనుగుణంగా మార్చి వెండి తెరపై సినిమా చేస్తే బాగుంటుంది అని అజయ్ దేవగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది, కాగా అజయ్ రామ్ దేవ్ గెటప్ లో ఎలా ఉంటాడు అనే ఊహాని అందరూ ఊహించుకొంటున్నారు.. పొడవు జుట్టుతో, ఎర్రని వస్త్రాన్ని ఒళ్లంతా కప్పుకుని అజయ్ ఆ గెటప్ కి సూట్ అవుతాడా అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







