దిల్ రాజు కల నెరవేర్చబోతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్
- June 27, 2017
డిస్ట్రిబ్యూటర్ నుంచి మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు.. ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో సిద్ద హస్తుడు.. కాగా దిల్ రాజు మెగా హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ లతో సినిమాలను నిర్మించాడు.. ఇప్పటికే బన్నీ, చరణ్, తేజులకు సూపర్ హిట్ సినిమాలను అందించాడు. కాగా తనకు పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని ఉన్నదని దిల్ రాజు బహిరంగంగానే ఎన్నో సార్లు తన కోరికను తెలియజేశాడు.. కాగా తాజాగా దిల్ రాజు కోరిక ను తీర్చుకొనే పనిలో ఉన్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు..
పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల లోపు వీలైనన్ని సినిమాలు చేసి.. పూర్తి స్థాయిలో రాజకీయనాయకుడిగా మారనున్నాడు అన్న సంగతి విధితమే.. ఈ నేపద్యంలో ఇక రెండు మూడు సినిమాలను మాత్రమే పవన్ చెయ్యగలడు.. దీంతో దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయనున్నట్లు దిల్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే పవన్ కల్యాణ్ సినిమా కోసం మంచి కధను.. దర్శకుడిని వెదికే పనిలో దిల్ రాజు ఉన్నాడట. ఈ సినిమా 2019 నాటికి రెడీ అవుతుందని తెలుస్తోంది..
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







