సంతోషంగాలేము.. బరాక్ ఒబామాలాంటి వారే కావాలి
- June 27, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో దేశం సంతోషంగా లేదని అంటున్నాడు హాలీవుడ్ నటుడు అన్సెల్ ఎల్టోర్ట్. ట్రంప్ పాలన గురించి ఎల్గోర్ట్ తన అభిప్రాయాలను మీడియా ద్వారా వెల్లడించారు.
'ఆయన పాలనతో నాకు సంతోషం లేదు. కానీ ఇదో మేల్కొలుపులా భావిస్తాను. ఈ అనుభవంతోనైనా మున్ముందు ఇలాంటి నేతలు అధ్యక్షులు కాకుండా జాగ్రత్తపడతాం. అయితే చాలా మంది ప్రజలు ఈ అనుభవం నుంచి ఏమీ నేర్చుకోలేకపోతున్నారు. ప్రజలు చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారని తెలిసి నన్ను నేను కోల్పోయినట్లుగా భావిస్తున్నాను.'
'మరో పదేళ్లలో మాకు ఒబామా లాంటి అధ్యక్షుడు వస్తాడు. కానీ ఆ తర్వాతమళ్లీ మా దేశం ఓ ఇడియట్ చేతిలోకే వెళ్లిపోతుంది. ట్రంప్ చేతకానివాడు. మాకు అవసరమైన విషయాలన్నీ అతను మా నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు. సామాజిక సేవల్ని దూరం చేస్తున్నాడు. ప్రజలకు మా నుంచి కావాల్సింది అదే కదా.
ఆ సేవతోనే దేశానికి పేరొస్తుంది' అని చెప్పుకొచ్చాడు ఎల్గోర్ట్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







