యంగ్ హీరో నిఖిల్ ప్రేమ పెళ్లి పై రూమర్స్ !
- June 27, 2017
యంగ్ హీరో నిఖిల్ పెళ్లి గురించి వార్తలు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో చాలసార్లు ఇతడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు రావడం ఆవార్తలను నిఖిల్ ఖండించడం చాలా సార్లు జరిగింది. హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ గురించి ఆపై డేటింగ్ గురించి వార్తలు రావడం సర్వసాధారణం అయినా ఇటువంటి వార్తలు ఎప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉంటాయి.
ప్రస్తుతం ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం నిఖిల్ తో ప్రస్తుతం చాల సన్నిహితంగా మెలుగుతున్న ఆ హీరోయిన్ బుల్లితెర ప్రేక్షకులకు చాలా సుపరిచితమైన సెలిబ్రెటీ అంటున్నారు. తెలుగు తమిళ కన్నడ సినిమా రంగాలకు సంబంధించి ఎన్నో సినిమాలలో నటించిన ఆహీరోయిన్ ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడంలేదు అని అంటున్నారు.
గతంలో ఈమె నిఖిల్ తో నటించిన ఒక సినిమా ఘన విజయం సాధించినప్పుడు వీరిద్దరి పై ఇటువంటి రూమర్స్ వచ్చాయి. అయితే ఆ గాసిప్పులు తరువాత సర్దు మణిగాయి. తమ మధ్య అలాంటి రిలేషన్ లేదనివారు తమ సన్నిహితుల వద్ద చేపుతున్నపటికీ తిరిగి వారిద్దరు సాన్నిహితంగా ఉండటమే కాకుండా ప్రస్తుతం వీరిద్దరూ పీకలలోతు ప్రేమలో ఉన్నట్లు మళ్ళీ వార్తల హడావిడి మొదలు అయింది.
ప్రస్తుతం వరస విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్ లేటెస్ట్ మూవీ 'కేశవ' మంచి సక్సస్స్ అందుకున్న నేపధ్యంలో చాలా మంది దర్శక నిర్మాతలు నిఖిల్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే నిఖిల్ కెరియర్ నెమ్మదిగా ఏడుగుతున్న నేపధ్యంలో ఈ ప్రేమ వ్యవహారాన్ని నిఖిల్ ఇలాగే కొనసాగిస్తాడా ? లేదంటే త్వరలోనే తన ప్రేమ పెళ్లి వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటిస్తాడా అనే విషయం పై రకరకాల కధనాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి..
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







