బొప్పాయి పండే కాదు.. బొప్పాయి ఆకులతోనూ ఎన్నో ప్రయోజనాలు..
- June 27, 2017
సాధారణంగా బొప్పాయి పండుతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందుకే ఉదయాన్నే బొప్పాయి పండును ఆరగిస్తారు. ఈ పండును దేవదూత పండు అని పిలుస్తారు. ఈ పండులో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. భోజనం చేశాక బొప్పాయి పండు తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. బొప్పాయి తినడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని అరికట్టవచ్చు. ఉడికించిన కోడిగుడ్డు, బొప్పాయి పండు ముక్కలతో కలిపి తింటే కాలేయ వ్యాధులు దరిచేరవు. అలాగే, బొప్పాయి ఆకులతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బొప్పాయి ఆకులతో చేసిన జ్యూసు తాగడం వల్ల శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. అందుకే డెంగ్యూ సోకిన వారిని ఈ జ్యూస్ తాగమంటారు. బొప్పాయి ఆకులు మెత్తగా దంచి, పసుపుతో కలిపి పట్టు వేస్తే బోదకాలు తగ్గుతుంది. బొప్పాయి ఆకుల్లో యాంటీ-మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజెనిన్ విషజ్వరాలు రాకుండా కాపాడుతుంది. జీర్ణక్రియ బాగా జరగడమే కాకుండా మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఇందులోని యాంటి-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పేగులోని, పొట్టలోని మంటను తగ్గిస్తాయి.
ఈ జ్యూస్ పెప్టిక్ అల్సర్లను కూడా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది. శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. ఆకులోని యాంటాక్సిడెంట్లు కిడ్నీ దెబ్బతినకుండా కాపాడడంతో పాటు ఫ్యాటీ లివర్ సమస్యను నివారిస్తాయి. బొప్పాయి ఆకుల జ్యూసు ఆడవాళ్లకు బహిష్టు సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
బొప్పాయి ఆకుల్లో విటమిన్-సి, విటమిన్-ఎ లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ జ్యూసు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎంతో కాంతిమంతంగా ఉంటుంది. బొప్పాయి ఆకుల గుజ్జు తలకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. నేచురల్ కండిషనర్‌గా పనిచేస్తూ శిరోజాలను కాంతిమంతంగా ఉంచుతుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







