తమిళ హాస్య నటుడి నగలు దోపిడీ
- June 27, 2017
తమిళ హాస్యనటుడు కొట్టాచ్చి దారిదోపిడీకి గురయ్యారు. సోమవారం తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకునేందుకు అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో కొట్టాచ్చి బస్‌లో సేలం చేరుకున్నాడు. అక్కడ ఓ ఆటో ఎక్కాడు. కొంత దూరం వెళ్లిన తరువాత ఆటోలో మరో ఇద్దరు ఎక్కారు. సురమంగళం, నరసోదిపట్టి ప్రాంతానికి చేరుకోగానే ఆటోలో ఉన్నవాళ్లు కొట్టాచ్చిపై దాడిచేసి అతని వద్ద ఉన్న రెండు సవర్ల బంగారు గొలుసు, రూ.2,500 నగదు, ఏటీఎం కార్డు లాక్కొని ఆటో నుంచి కిందకు తోసేశారు.
గాయాలపాలైన కొట్టాచ్చి సేలంకు చెందిన మరో హాస్యనటుడు బెంజిమన్‌కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించాడు. బెంజిమెన్ అక్కడికి రాగా ఇద్దరూ దోపిడీపై సురమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి ఓ పోలీస్ అధికారి తెలుపుతూ కొట్టాచ్చి సేలం వచ్చినప్పుడు మద్యం సేవించి ఉన్నారని తెలిపారు. ఆటోడ్రైవర్ ఇద్దరు హిజ్రాలతో కలిసి కొట్టాచ్చి వద్ద దోపిడీ చేసినట్టు చెప్పారు. ఆ డ్రైవర్ ఎవరన్నది తెలిసిందని, అతని కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- Dubai Press Club launches new phase of ‘Dubai Content Creators Programme’
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి







