జులై 14న విడుదల కానున్న 'టీమ్ 5 '
- June 28, 2017
బౌలర్ శ్రీశాంత్ హీరోగా టీమ్ 5 మూవీలో నటించనున్నాడు. ఈ మూవీని తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో రూపొందిస్తున్నారు.. శ్రీశాంత్ సరసన నిక్కి గిలాని నటిస్తున్నది.. సురేష్ గోవింద్ దర్శకుడు. గోపీ సుందర్ సంగీతం, రాజ్ జకారియా నిర్మాత.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో ఉంది.. ఈ సినిమా వచ్చేనెల 14వ తేదీన విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ జకారియా మాట్లాడుతూ, బైక్ రేసర్లు అయిన అయిదుగురు స్నేహితుల మధ్య చోటుచేసుకునే అనూహ్యమైన సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కిందని అన్నారు. ప్రతి పాత్రను దర్శకుడు సురేష్ గోవింద్ అద్భుతంగా మలిచాడని చెప్పారు. గోపిసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లవ్ .. ఫ్రెండ్షిప్ .. యాక్షన్ .. ఎమోషన్ కలయికగా రూపొందిన ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







