ఓ బామ్మ నాణాలు.. విమానం ఇంజన్లో విసిరేసింది
- June 29, 2017
ఓ బామ్మ కారణంగా కాసేపట్లో బయలుదేరాల్సిన విమానం ఎయిర్‌పోర్టులో హఠాత్తుగా ఆపేశారు. విమానం ఇంజన్‌ను ఓపెన్ చేసి మరమ్మత్తు చేసినంత పనిచేశారు. దీంతో కొన్నిగంటలు ఆలస్యంగా ఆ విమానం బయల్దేరాల్సివచ్చింది. ఇంతకీ ఆ బామ్మ చేసిన పని ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే!
షాంఘై పుడోంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి చైనా విమానం సీజెడ్ 380 గాంగ్జౌ సిటీకి బయలుదేరేందుకు రెడీగా వుంది. ఈలోగా గాంగ్జౌకి వెళ్లేందుకు 80 ఏళ్ల బామ్మ ఆమె భర్త, కూతురు, అల్లుడుతో కలిసి విమానం ఎక్కుతోంది. ఐతే, ఈ బామ్మకు అతీతశక్తుల మీద నమ్మకం ఎక్కువగా వుండడంతో తమకు ఎలాంటి హానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో తన వద్దనున్న తొమ్మిది నాణాలను విమానం ఇంజన్‌లోకి విసిరేసింది. అది గమనించిన ఓ ట్రావెలర్ సిబ్బందికి చెప్పగా విమానాన్ని ఆపేశారు. అప్పటికే ఎక్కి కూర్చున్న 150 మందిని ప్రయాణికులను దింపేశారు. తొలుత ఇంజిన్ భాగంలో వెతగ్గా ఎనిమిది నాణాలు దొరికాయి. మరోనాణెం దొరక్కపోవడంతో ఇంజన్ భాగాన్ని విడదీసి చూడగా అందులో ఇరుక్కుపోయింది. చివరకు నాణాన్ని తొలగించి విమానాన్ని సిద్ధం చేసి పంపించారు. చివరకు బామ్మని, ఫ్యామిలీ సభ్యులను చైనా పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







