భారీ అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చిన ఫైర్ ఫైటర్స్
- June 29, 2017
ఓ ఫ్యాక్టరీలోని లూబ్రికెంట్స్ మరియు ఆయిల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సార్జా ఇండస్ట్రియల్ ఏరియా నెంబర్ 10లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం గురించిన సమాచారం అందుకోగానే, ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. పక్కనే ఉన్న వేర్‌హౌస్‌లకు అగ్ని కీలలు వ్యాపించకుండా ఫైర్‌ఫైటర్స్ వీరోచితంగా అగ్ని కీలలతో పోరాడారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ షార్జా సివిల్ డిఫెన్స్ కల్నల్ సమి అల్ నకాబి మాట్లాడుతూ, మంటల్ని అదుపు చేయడానికి చాలా సమయం పట్టిందన్నారు. లూబ్రికెంట్స్, ఆయిల్ మంటల కారణంగా ఇంత సమయం పట్టిందని తెలిపారాయన. నాలుగు గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించి వ్యవహరించడం, తగిన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనీ, సివిల్ డిఫెన్స్ ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాల విషయంలో తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు కల్నల్ సమి అల్ నకాబి.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







