అబుదాబీలో కొత్త ట్రాఫిక్ జరీమానాలు
- June 29, 2017
జులై 1 నుంచి కొత్త ట్రాఫిక్ జరీమానాలు అమల్లోకి రానున్నాయి. ఫెడరల్ ట్రాఫిక్ లా 21కి సంబంధించి జరిగిన అమెండ్‌మెంట్స్ నేపథ్యంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహనదారులు ఆయా నిబంధనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండడంలో వాహనదారులదే కీలక పాత్ర అని చెప్పారు అబుదాబీ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ అలి ఖల్ఫాన్ అల్ దహెరి చెప్పారు. కొత్త జరీమానాలు, కొత్త రూల్స్‌కి సంబంధించి వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారాయన. సిగ్నల్స్‌ని లెక్క చేయని వాహనదారులకు, సీట్ బెల్ట్ పెట్టుకోని వాహనదారులకు, కార్ విండో గ్లాస్ టింట్ చేసి ఉన్నందుకు ఇలా రకరకాలైన ఉల్లంఘనలకు కఠినంగా జరీమానాలు విధిస్తారు. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ పట్ల మరింత కఠినంగా కొరడా ఝుళిపించనున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







