దమ్‌కీ బెండీ
- June 29, 2017
కావలసినవి: బెండకాయలు (చిన్నవి) - 300 గ్రా, నెయ్యి - 25 గ్రా, ఉల్లిపాయ ఒకటి తరిగినది, పావు టీ స్పూను జాజికాయ పొడి. , ఉప్పు తగినంత..
లోపల కూరడానికి: నెయ్యి 12 గ్రా., మామిడి పొడి 8గ్రా., ధనియాల పొడి రెండు గ్రా.,జీలకర్ర పొడి ఒక గ్రా., నల్లమిరియాల పొడి ఒక గ్రా., కారం ఒక గ్రా., పసుపు ఒక గ్రా., నల్లయాలకుల పొడి ఒక గ్రా.,
అలంకరణకి: పచ్చిమిరపకాయలు రెండు, గుప్పెడు కొత్తిమీర, కోసి వేగించిన ఆలుగడ్డలు 500గ్రా.
తయారీ విధానం:
బెండకాయల తొడిమలు తీసి నిలువుగా చీరుకుని పక్కన పెట్టుకోండి. కూరడానికి ఇచ్చిన పదార్థాలన్నింటినీ కలుపుకుని బెండకాయల్లో సమానంగా కూరుకోండి. నెయ్యి వేడి చేసి కూరిన బెండకాయలను వేసి మూతపెట్టి ఒక మాదిరి సెగ మీద ఉడికించండి. అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి. ఐదారు నిమిషాల తరువాత సెగ తగ్గించి అందులో ఉల్లిపాయ ముక్కలు, జాజికాయ పొడి వేసి మూత పెట్టి మరో పదినిమిషాలు వేగించండి. మధ్యలో తిప్పుతూ ఉడికిన తరువాత దించి ఆలుగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీరలతో అలంకరించి వడ్డించండి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







