20వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి డాక్టర్ మృతి
- June 29, 2017
షార్జా: 20 వ అంతస్తు నుంచి ఓ వైద్యుడు పట్టు తప్పి కిందకు జారీ దుర్మరణం పాలయ్యాడు.షార్జాలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ విషాదకర సంఘటనలో 62 ఏళ్ల ఇరాక్ డాక్టర్ తన అపార్టుమెంటు బాల్కనీలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా పట్టు తప్పి కిందపడి చనిపోయాడని ప్రత్యక్షసాక్షి తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.షార్జా పోలీస్ అధికారి " మా గల్ఫ్ న్యూస్ డాట్ కామ్ " గురువారం మాట్లాడుతూ, మృతి చెందిన వైద్యుడు ఒక ఇరాకీ డాక్టర్ అని, మృతునికి సంబంధిన పేరులోని మొదటి మూడు అక్షరాలను మాత్రమే ఆయన తెలిపారు. డాక్టర్ " ఓ ఎస్ టి " గా ఆయనను గుర్తించినట్లు వివరించారు. అంత ఎత్తు నుంచి ఒక్కసారే కిందకు పడటంతో ఆ వైద్యుడు తక్షణమే మరణించారు. "పోలీసు ఆపరేషన్ రూమ్ కు సాయంత్రం 5 గంటల సమయంలో అల్ ఖాన్ ప్రాంతంలో 20 వ అంతస్థు భవనంలోఉన్న బాల్కనీ నుంచి ఓ వ్యక్తి కిందకు పడిపోయాడని నివేదికలు అందుకున్నామని వెనువెంటనే పోలీసులు, అంబులెన్సులు ప్రమాదం జరిగిన చోటుకు తరలించినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అల్ కువైట్ ఆసుపత్రికి తరలించారు, ఆ తర్వాత శవపరీక్ష కోసం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు తరలించారు. అనంతరం వైద్యుని మృతికి దారి తీసిన పరిస్థితులపై అల్ బహీరా పోలీసులు విచారణ ప్రారంభించారు
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







