24,000 ప్యాక్‌ల టొబాకో సీజ్
- June 30, 2017
రియాద్: 24,000కి పైగా సిగరెట్ ప్యాక్స్‌ని ఓ ప్రైవేట్ ఎస్టాబ్లిష్‌మెంట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈస్టర్న్ ప్రావిన్స్‌లో ఈ సీజ్ జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సర్వీస్ ట్యాక్స్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ది జనరల్ అథారిటీ ఫర్ జకత్ మరియు ట్యాక్స్‌తో కలిసి ఈ దాడులు నిర్వహించింది. మొత్తం 24,810 సిగరెట్ ప్యాక్స్‌ని ఈ సందర్భంగా అధికారులు సీజ్ చేశారు. డమ్మమ్‌లోని ఓ సంస్థకు చెందినవిగా వీటిని గుర్తించారు. అధికారులకు తగిన సమాచారం ఇవ్వకుండా ఇంత పెద్ద మొత్తంలో సిగరెట్ ప్యాక్స్‌ని ఆ సంస్థ స్టోర్ చేసిందని తెలిపారు అధికారులు. ప్రతిపాదిత ట్యాక్స్ చెల్లించినవారికి మాత్రమే, అనుమతి మేరకు స్టాక్‌ని ఏర్పాటు చేసుకునే వీలుంది. దానికి భిన్నంగా సదరు యజమాని చట్టాన్ని ఉల్లంఘించి ఎక్కువ మొత్తంలో సిగరెట్ ప్యాక్స్‌ని స్టోర్ చేయడంతో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!







