జయభేరి ప్రాపర్టీస్ ఏపి లో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేట్టనుంది
- October 15, 2015
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు మురళీ మోహన్‌కు చెందిన జయభేరి ప్రాపర్టీస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేట్టనుంది. హైదరాబాదులోని హైటెక్ సిటీలో, హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఈ సంస్థ పలు ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తాకథనం వచ్చింది. రాజధాని ప్రాంతంలోని కుంచనపల్లి వద్ద 1.27 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టును చేపట్టడానికి రాష్ట్ర ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ (ఎస్ఇఐఎఎ) ఇటీవల జయభేరికి క్లియరెన్స్ ఇచ్చింది. జయభేరి కుంచనపల్లి వద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే విషయంలో రాష్ట్ర ఎన్విరాన్‌మెంట్ అప్రైజల్ కమిటీ సిఫార్సులను ఎస్ఎఐఎఎ ఆమోదించింది. కుంచనపల్లి అమరావతికి అతి సమీపంలో ఉంటుంది. అయితే, ల్యాండ్ పూలింగ్ ఏరియాలో ఈ గ్రామం లేదు. దీంతో మురళీమోహన్ అక్కడ తన ప్రాజెక్టులకు స్తలాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన మురళీ మోహన్ హైటెక్ సిటీలోని మాదాపూర్‌లో, హైదరాబాదులో పలు రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేపట్టి పూర్తి చేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







