అమెరికా నైట్ క్లబ్ లో కాల్పులు
- July 01, 2017
న్యూయార్క్‌లో వైద్యుడి కాల్పుల ఉదంతం జరిగిన కొద్ది గంటలకే.. అర్కాన్సస్ రాష్ట్ర రాజధాని లిటిల్ రాక్ సిటీలో భీకరకాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం రాత్రి నగరంలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో సుమారు 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నైట్‌క్లబ్, పరిసర ప్రాంతాలను చుట్టుముట్టారు. ఇది ఉగ్రదాడేమోననే భయంతో అక్కడివారు భయాందోళనకు గురయ్యారు.
నైట్‌క్లబ్‌లో రెండు వర్గాలకు మధ్య తలెత్తిన వివాదమే కాల్పులకు దారితీసిందని లిటిల్ రాక్ సిటీ పోలీస్ చీఫ్ కెన్టన్ బక్నర్ మీడియాకు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, కాల్పులు జరిపిన దుండగుడిని ఇంకా గుర్తించలేదని పేర్కొన్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







