14 న రానున్న 'డా||చక్రవర్తి'
- July 01, 2017
తెలుగు ఇండస్ట్రీలో ఎ ఫిల్మ్ బై అరవింద్ చిత్రం మంచి విజయం సాధించింది. సస్పెన్స్, థ్రిల్లర్ గా కొనసాగిన కథతో రాజీవ్ కనకాల, రిషి చాలా అద్భుతంగా నటించారు. ఇండస్ట్రీలో అడపాదడపా వస్తూ హీరోగా సెటిల్ కావడానికి రుషి ఎంతగానో కష్టపడుతున్నాడు. తాజాగా రిషి, సోనియామాన్ జంటగా నటించిన 'డా||చక్రవర్తి' ఈ నెల జూలై 14 న అన్ని కార్యక్రమాలు ముగించుకొని రిలీజ్ కాబోతుందని చిత్ర యూనిట్ తెలిపారు. శ్రీ వేంకటేశ్వర సూపర్ మూవీస్ బ్యానర్పై 'ఎ ఫిల్మ్ బై అరవింద్' వంటి సెన్సేషనల్ చిత్రాన్ని రూపొందించిన శేఖర్ సూరి దర్శకత్వంలో ఎ. వెంకటేష్ (ఛాంప్) నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'డా||చక్రవర్తి'. రిషి, సోనియామాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎ.వెంకటేష్ (ఛాంప్) మాట్లాడుతూ..''ఎ ఫిల్మ్ బై అరవింద్'' చిత్ర దర్శకుడు శేఖర్ సూరి ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంతో ఉత్కంఠతను కలిగించేలా తెరకెక్కించారు. ఏప్రిల్ 19న ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా విడుదల చేసిన ఈ చిత్ర టీజర్లో యూట్యూబ్లో సంచలన విజయం సాధించి, సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై 14 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము. 'ఎ ఫిల్మ్ బై అరవింద్'లా ఈ చిత్రం కూడా ఘన విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాము...అని అన్నారు.
దర్శకుడు శేఖర్ సూరి మాట్లాడుతూ...ఒక యదార్థ సంఘటన ఆధారంతో.. చక్కని స్క్రీన్ప్లేతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'డా||చక్రవర్తి'. నిర్మాత ఈ చిత్ర రూపకల్పన కోసం ఎంతగానో సహకరించారు. ఖర్చుకు వెనకాడకుండా హై టెక్నికల్ వ్యాల్యూస్తో చిత్రాన్ని తెరకెక్కించాము. విజయ్ కురాకుల మ్యూజిక్ ఈ చిత్రానికి పెద్ద హైలైట్ అవుతుంది. అల్రెడీ విడుదలైన టీజర్కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులు మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను..అని అన్నారు.
రిషి, సోనియామాన్, గిరీష్ సహదేవ, లీనా, వంశీ, అశోక్కుమార్, కుమారన్, చైతన్య, పూజ, లావణ్య, పోకిరి విజయ్, అనిరుధ్ సింగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కురాకుల, కెమెరా: రాజేందర్, ఎఫెక్ట్స్: ఇతిరాజ్, డైలాగ్స్: చిట్టి శర్మ, మిక్సింగ్: రంగరాజు; ఎడిటింగ్: తిరుపతి రెడ్డి, నిర్మాత: ఆకుల వెంకటేష్ (ఛాంప్), కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: శేఖర్ సూరి.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







