నాల్గో వన్డే : ఇండియా పై విండీస్ గెలుపు
- July 02, 2017
విండీస్ టూర్ లో టీమిండియాకు తొలి పరాభవం ఎదురైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో ఆతిథ్య విండీస్ 11 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఎవిన్ లెవిస్ 35, కైల్ హోప్ 35, షాయ్ హోప్ 25, రోస్టన్ చేజ్ 24, జాసన్ మహ్మద్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, హార్ధిక్ పాండ్యా చెరో 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నాడు.
అనంతరం 190పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. విండీస్ బౌలర్ల దెబ్బకు 49.4 ఓవర్లలోనే 178 పరుగులకు ఆలౌటయ్యారు. రహానే (60), మహేంద్ర సింగ్ ధోనీ (54), హార్ధిక్ పాండ్యా (20) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. విండీస్ కెప్టెన్ హోల్డర్ 5 పరుగులు పడగొట్టడం విశేషం. ఈ గెలుపుతో విండీస్ 1-2తో భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది. సిరీస్ ఫలితం 6 వ తేదీన జరగనున్న చివరి వన్డేకు మారింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







