శమంతకమణి ప్రీ-రిలీజ్ ఈవెంట్

- July 03, 2017 , by Maagulf
శమంతకమణి ప్రీ-రిలీజ్ ఈవెంట్

నలుగురు యంగ్ హీరోలు.. సుధీర్ బాబు, ఆది, సందీప్ కిషన్, నారా రోహిత్ నటిస్తున్న 'శమంతకమణి' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించాలని మేకర్స్ యోచిస్తున్నారు. సోమవారం జరగనుందీ ఫంక్షన్.
'భలే మంచి రోజు' చిత్రం ఫేం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు బాలయ్య, పూరీ జగన్నాథ్ చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారని సమాచారం. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
 
5 కోట్ల ఖరీదు చేసే శమంతకమణి అనే విలాసవంతమైన కారు కోసం ఈ హీరోలు పడరాని పాట్లు పడడమే ఈ చిత్రం థీమ్. కామెడీ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న 'శమంతకమణి' చిత్రం త్వరలో విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com