రామ్ గోపాల్ వర్మబ్రూస్ లీ సినిమా మీద
- October 17, 2015
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్ కు పని చెప్పాడు. నిన్నంతా ( శుక్రవారం) బ్రూస్ లీ సినిమా మీద మాటల దాడి చేసిన వర్మ... తాజాగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశాడు. బ్రూస్ లీ యూనిట్ చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నా, తను మాత్రం చిరంజీవిని 150వ సారి వెండితెర మీద చూశానని, ఇదే చిరు 150వ సినిమా అంటూ తేల్చేశాడు వర్మ. 150వ సినిమాగా బ్రూస్ లీ సినిమాను ఎంచుకోవడం ప్రజారాజ్యం పార్టీ పెట్టడం లాంటి మెగా తప్పేనని వర్మ చెప్పాడు. అయితే ఆయన 151వ సినిమా మాత్రం ఎంటర్ ద డ్రాగన్ లాంటి మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నానన్నాడు. 'చిరు 151వ సినిమాగా ఓ తమిళ రీమేక్ సినిమాను చేస్తున్నాడని వస్తున్న వార్తలు అవాస్తమని భావిస్తున్నా, ఆ సినిమా బాహుబలిలా ఒరిజినల్ సినిమా అయి ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి ఎంత గొప్ప అన్నది విషయం కాదు, మెగాస్టార్ అన్నది అన్నింటికంటే పెద్ద విషయం, అందుకే తమిళ సినిమా రీమేక్ లో నటించి తెలుగు వారి గౌరవాన్ని దెబ్బతీయోద్దు, రాజమౌళిలా తెలుగు వారి గౌరవాన్ని మరింతగా పెంచాలి. మెగా ఫ్యామిలీ అభిమానిగా చెబుతున్నా.. చిరు 151వ సినిమాగా రీమేక్ సినిమాను చేయొద్దు, ఒరిజినల్ సినిమానే చేయాలి. అది కూడా బాహుబలిని మించే భారీ సినిమా చేయాలి. మిగతా మెగా అభిమానులు కూడా చిరంజీవి రీమేక్ సినిమా చేయొద్దని కోరాలి. చిరంజీవి లాంటి మెగాస్టార్ తమిళ కాపీ సినిమా చేయటం అనేది తెలుగు వారికి అవమానం, అందుకే చిరంజీవి తమిళ రీమేక్ లో నటిస్తున్నాడన్న వార్త రూమర్ అనుకుంటున్నా'. అంటూ ట్వీట్ చేశాడు. బాహుబలి సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు వర్మ. ' బాహుబలి సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. రాజమౌళి ఇండియన్ సినిమాకు రియల్ బ్రూస్ లీ. రాజమౌళి గారూ.. చాలా మంది బ్రూస్ లీలు తాకి గర్వపడటం కోసం మీ కాళ్ల ఫొటోను ట్వీట్ చేయండి' అంటూ కామెంట్ చేశాడు. Congrats on 100 డేస్ తో బాహుబలి రాజమౌళి రియల్ బ్రూస్ లీ అఫ్ సినిమా ..రాజమౌళి సర్ ప్లస్ త్వీత్ అర ఫీట్ ఫర్ అల్ అస్ వాన్నబే బ్రూస్ లీ 'స తో టచ్ - రామ్ గోపాల్ వర్మ (@ర జి వ జూమిన్ ) అక్టోబర్ 16, 2015 అండ్ ఐ హోప్ రుమౌర్స్ అరె రాంగ్ అండ్ తెలుగు మెగా స్టార్ ఫర్ 151స్త్ విల్ నాట్ డో కాపీ అఫ్ తమిళ్ ఫిలిం అండ్ బె అ స మెగా ఒరిజినల్ అస్ రాజమౌళి ఇన్ బాహుబలి - రామ్ గోపాల్ వర్మ (@ర్గ్వ్జూమిన్ ) అక్టోబర్ 16, 2015 నో మేటర్ హౌ బిగ్ రాజమౌళి ఇస్ ,మెగా ఇస్ బిగ్గెర్ అండ్ టెలుగుస్ విల్ బె హర్ట ఐఫ మెగా ఇమ్పోర్త్స్ తమిళ్ ప్రైడ్ వ్హిలె రాజమౌళి ఇస్ ఎక్ష్పొర్తింగ్ తెలుగు ప్రైడ్ - రామ్ గోపాల్ వర్మ (@ర జి వ జూమిన్ ) అక్టోబర్ 16, 2015 ఫోర మెగా స్టార్ తో డో బ్రూస్ లీ అస్ 150థ్ ఇస్ అస్ బిగ్ అ మెగా రాంగ్ డెసిషన్ అస్ ప్రజారాజ్యం పార్టీ బట్ అం సరే 151స్త్ విల్ బె ఎంటర్ ది డ్రాగన్ - రామ్ గోపాల్ వర్మ (@ర జి వ జూమిన్ ) అక్టోబర్ 16, 2015
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







