శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం
- October 16, 2015
ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి కారణం శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవరేనని ప్రకాశం జిల్లా ఏఎస్పీ రామానాయక్ తెలిపారు. ట్రావెల్స్ నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రమాద ఘటనా స్థలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు చెప్పారు. కాగా, కందుకూరు ప్రభుత్వాస్పత్రిలో మృతుల, క్షతగాత్రుల బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. కాగా, ప్రమాద విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మార్పీఎస్ తీవ్రంగా మండిపడింది. ఇంత ఘోరమైన ఘటన జరిగినా.. ప్రభుత్వాస్పత్రికి మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి పరామర్శించకపోవడం సిగ్గుచేటని ఎమ్మార్పీఎస్ విమర్శించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపింది. ఈ ప్రమాద ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీతో ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి చినరాజప్ప మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ ఓలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సమీక్షించారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. చర్లోపల్లి ప్రమాదఘటనపై మంత్రి శిద్దా రాఘవరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







