బాదం హల్వా కాయిన్స్‌

- July 07, 2017 , by Maagulf
బాదం హల్వా కాయిన్స్‌

కావలసినవి: బాదం - 1 కప్పు (నానబెట్టి తోలు తీసినవి), బొంబాయి రవ్వ - అర కప్పు, చాక్లెట్‌ స్పాంజ్‌ కేక్‌ - 8 అంగుళాలు, నెయ్యి - 3 టే.స్పూను, పాలు - 2 కప్పులు, చక్కెర - ముప్పాతిక కప్పు, యాలకుల పొడి - పావు టీస్పూను.
 
తయారీ: 4 బాదం పప్పులు వేయుంచి పలుకుగా పొడిగొట్టుకోవాలి. బాండీలో నెయ్యి వేసి బొంబాయి రవ్వ మంచి వాసన వచ్చేవరకూ వేయించుకోవాలి. బాదం పలుకులు కూడా వేసి రవ్వ బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. మరో బాండీలో పాలకు ఓ కప్పు నీళ్లు చేర్చి మరిగించాలి. మరిగాక రవ్వ వేసి అడుగంటకుండా 2 ని.లపాటు తిప్పుతూ ఉండాలి. చక్కెర, యాలకుల పొడి వేసి చక్కెర కరిగేదాకా ఉడికించి తీయాలి. ఇలా తయారైన హల్వాను పక్కన ఉంచుకోవాలి. చాక్లెట్‌ స్పాంజ్‌ కేక్‌ను కుకీ కటర్‌ సహాయంతో కాయిన్స్‌లా కట్‌ చేసుకోవాలి. వీటిని పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి. సర్వింగ్‌ ప్లేట్‌లో ఈ కాయిన్స్‌ను అమర్చి పైన ముందుగా చేసి పెట్టుకున్న హల్వాను ముద్దలా ఉంచి.. బాదం పప్పుతో అలంకరించి సర్వ్‌ చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com