ఖతర్‌పై జి.సి.సి దేశాల మండిపాటు
- July 07, 2017
రియాద్: సౌదీ అరేబియా, దాని మిత్ర దేశాలు ఖతర్ మొండి వైఖరిపై మండిపడ్డాయి. తమ డిమాండ్లను ఖతర్ ఒప్పుకోకపోవడంతో ఆ దేశంపై గుర్రుగా ఉన్నాయి. అరబ్ దేశాల్లో శాంతిభద్రతలను దెబ్బతీయడమే తన లక్ష్యంగా ఖతర్ పెట్టుకుందని ఆరోపిస్తున్నాయి. సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ, బహ్రెయిన్ లాంటి అరబ్ దేశాలు.. ఖతర్‌తో దౌత్య, ఆర్థిక, బౌగోళిక సంబంధాలను తెంచుకోవడం తెలిసిందే.
గత నెలలో అల్‌జజీరా చానల్ మూసివేత, టర్కీ సాయుధ దళాల తొలగింపు, ఇరాన్‌తో బంధాలను తెంచుకోవడం, ఐసిస్, అల్‌కాయిదా వంటి పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను తెంచుకోవడం వంటి 13 డిమాండ్లను అంగీకరించాలని ఖతర్‌ను కోరాయి. ఈ మేరకు ఇచ్చిన గడువు కూడా ముగిసిన నేపథ్యంలో అరబ్‌దేశాలు ఖతర్‌పై విరుచుకుపడుతున్నాయి.
తాజా వార్తలు
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!







