సౌత్ ఆస్ట్రేలియా ఓపెన్‌ను కైవసం చేసుకున్న హరీందర్
- July 08, 2017
భారత స్క్వాష్ క్రీడాకారుడు హరీందర్ పాల్ సంధు సౌత్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ని కైవసం చేసుకున్నాడు. టోర్నీలో భాగంగా నిర్వహించిన ఫైనల్లో హరీందర్... ఆస్ట్రేలియా క్రీడాకారుడు రిస్ డౌలింగ్పై 11-8, 12-10, 11-4తేడాతో విజయం సాధించాడు. తొలి గేమ్‌లో ఒకానొక దశంలో 1-7తో వెనుకబడి ఉన్న హరీందర్ ఆ తర్వాత పుంజుకుని 11-8తో కైవసం చేసుకున్నాడు. హోరా హోరీగా జరిగిన రెండో గేమ్‌ని 12-10తో గెలుచుకున్న హరీందర్ మూడో గేమ్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
మ్యాచ్ అనంతరం హరీందర్ మాట్లాడుతూ.. 'చల్లని వాతావరణ పరిస్థితుల మధ్య ఆడటంతో ఈ వారం చాలా కష్టంగా గడిచింది. గతంలోనూ ఎన్నోసార్లు ఆస్ట్రేలియాలో టోర్నమెంట్లు ఆడాను. మొదటిసారి ఇక్కడ పీఎస్ఏ టోర్నమెంట్ గెలవడం సంతోషంగా ఉంది. సెమీఫైనల్లో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొన్నా' అని తెలిపాడు. మొత్తంగా హరీందర్కి ఇది 8వ పీఎస్ఏ టైటిల్ కాగా ఈ సీజన్లో ఇది మూడోది. మేలో మలేసియాలో రెండు టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









