శివకార్తికేయన్, సమంతల సినిమా ప్రారంభం
- July 08, 2017
సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న నటుడు శివకార్తికేయన్. ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో 'వేలైక్కారన్' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. నవరాత్రి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ప్రస్తుతం పొన్రామ్ దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'వరుత్తపడాద వాలిబర్ సంఘం', 'రజనీ మురుగన్' చిత్రాలొచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ సొంతం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సమంత కథానాయిక. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అయితే శుక్రవారం నుంచి సమంతకు సంబంధించి సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సమంతకు చిత్రయూనిట్ ఘనస్వాగతం పలికింది. ప్రారంభంలోనే శివకార్తికేయన్, సమంతలకు సంబంధించి ప్రేమ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 24 ఏఎం ప్రొడక్షన్స్ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్, నెపోలియన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
డి.ఇమాన్ స్వరాలు సమకూర్చుతున్నారు. ఇమాన్ సంగీతంలోని 'వరుత్తపడాద వాలిబర్ సంఘం', 'రజనీ మురుగన్' పాటలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ఈ చిత్రంలోని పాటలు కూడా తప్పకుండా హిట్ అవుతాయని చిత్ర బృందం చెబుతోంది. కనల్‌కన్నన్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







