ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌కు సాక్షి మాలిక్ మరియు వినీశ్ ఫొగట్
- July 08, 2017
అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, ఆసియా ఛాంపియన్షిప్ విజేత వినీశ్ ఫొగట్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌కు ఎంపికయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వచ్చే నెలలో ఈ పోటీలు జరగను న్నాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య లఖ్‌నవూలో ఆయా విభాగాల్లో ట్రయల్స్ నిర్వహించి భారత తరుపున పోటీదారులను ఎంపిక చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత (58కెజీలు), ఆసియా ఛాంపియన్ షిప్ (60కెజీలు) రజత పతక విజేత సాక్షి మాలిక్ ఈపోటీలకు ఎంపికైంది. ఆసియా ఛాంపియన్స్‌షిప్‌లో రజతం కైవసం చేసుకున్న వినీశ్ ఫొగట్ (48కేజీల) విభాగంలో బరిలోకి దిగనుంది. శ్రీతల్ 53కిలోల విభాగంలో, పూజా దండ 58కెజీల, శిల్పి 63కిలోల, నవజోత్ కౌర్ 69కిలోల, పూజ 75కేజీల విభాగాల్లో ప్రపంచ ఛాంపి యన్ షిప్‌కు ఎంపికయ్యారు. గీతాఫొగట్, బబితా ఫొగట్ ట్రయల్స్‌లో పాల్గొనలేదు. రితు, సంతీత ఫొగట్ అర్హత సాధించలేక పోయారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







