మచ్చర్‌ జల్‌ సొర్సె పాబ్డా

- July 10, 2017 , by Maagulf
మచ్చర్‌ జల్‌ సొర్సె పాబ్డా
కావాల్సిన పదార్థాలు:
 పాబ్డా చేప - 180గ్రాములు, ఉల్లిపాయని ఉడికించిన గుజ్జు - 50గ్రాములు, టొమాటో గుజ్జు - 50గ్రాములు, పచ్చిమిర్చి - మూడు, అల్లం వెల్లుల్లి గుజ్జు - 15గ్రాములు, జీలకర్ర - ఐదు గ్రాములు, ధనియాల ముద్ద - ఐదు గ్రాములు, ఎండుమిర్చి - మూడు, పసుపు రంగు ఆవాల గుజ్జు, నలుపు ఆవాల గుజ్జు - ఒక్కోటి పది గ్రాముల చొప్పున, కొత్తిమీర - అలంకరణకు, వేగించిన జీలకర్ర పొడి - ఐదు గ్రాములు, పసుపు - మూడు గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, ఆవ నూనె - తగినంత, పంచదార - మూడు గ్రాములు, పచ్చి మిర్చి గుజ్జు - మూడు గ్రాములు, నల్లజీలకర్ర - రెండు గ్రాములు, పచ్చిమిర్చి గుజ్జు - మూడు గ్రాములు.
 తయారీ విధానం:
 చేపను శుభ్రంగా కడిగి రెండు వైపులా ఉప్పు, పసుపు వేసి నానబెట్టాలి.
తరువాత ముక్క మునిగే నూనె పోసి అందులో నానబెట్టిన ముక్కల్ని వేగించాలి.
ఒక పాత్రలో నూనె వేడి చేసి నల్ల జీలకర్ర వేయాలి. అవి చిటపట అంటున్నప్పుడు ఉల్లిపాయ, టొమాటో, అల్లంవెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చిల గుజ్జు వేయాలి. పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కొద్దిసేపు వేగించాలి.
ఆ తరువాత ఆవగుజ్జు వేసి పావు గంట ఉడికించాక చేప వేయాలి. దానిపైన వేగించిన జీలకర్రపొడి, కొత్తిమీర తరుగు వేసి అలంకరించాలి. దీన్ని కూడా అంతే హాట్‌ హాట్‌గా తింటే యమ్మీ యమ్మీగా ఉంటుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com